ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు

ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చింది. ఓటుకు కోట్లు కేసు వ్యవహారం అవినీతి నిరోధక చట్టం కిందకే వస్తుందని ఆర్కే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలు ఇస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సంగతి తెలిసిందే. 

Back to Top