చంద్రబాబుకు అంబేద్కర్ గారు ఇప్పుడు గుర్తుకు వచ్చారు
నిన్నటి అసెంబ్లీ అజెండాలో అంబేద్కర్ అంశమే లేదుః వైఎస్ జగన్
మొదటిసారి అసెంబ్లీ వాయిదా పడేవరకు అంబేద్కర్ టాపిక్ రాలేదుః వైఎస్ జగన్
కాల్ మనీ సెక్స్ రాకెట్ డిస్కషన్ జరగకూడదని చెప్పి సడన్ గా అంబేద్కర్ పేరు తీసుకొచ్చారు
నిజానికి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న, వర్ధంతి డిసెంబర్ 6న.
ఆయన అధ్యక్షత వహించిన రాజ్యాంగ సంఘం తొలి సమావేశం డిసెంబర్ 9, 1946
రాజ్యాంగ రచన పూర్తి చేసింది నవంబర్ 26న
చంద్రబాబుకు ఈ తేదీలలో ఎప్పుడూ అంబేద్కర్ గుర్తురాలేదు. అప్పుడు నివాళులు అర్పించాలని అనుకోలేదు
డిసెంబర్ 17న ఏమీ లేనప్పుడు మాత్రం అసెంబ్లీలో అంబేద్కర్ గురించి చర్చిస్తామంటారు
కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు అంబేద్కర్ పేరు వాడుకోవడం దారుణం
సెక్స్ రాకెట్ లో ఉన్నది అంబేద్కర్ బిడ్డలు కాదా, పేదవాళ్లు కాదా ..?
అంబేద్కర్ విగ్రహంపై దండ ఎండిపోయి దుమ్ము ధూళి పడితే శుభ్రం చేయని చంద్రబాబు సభలో ఉపన్యాసాలు చేస్తున్నారు
సెక్స్ రాకెట్ ను దారిమళ్లించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వడ్డీవ్యాపారులపై దాడులు చేయిస్తున్నారు
చంద్రబాబు లాంటి రాక్షస పాలన ఎక్కడా లేదుః వైఎస్ జగన్
చంద్రబాబు నిందితులతో ఉన్న ఫోటోలు వైఎస్ జగన్ ప్రదర్శించారు
చంద్రబాబుతోను, ఇంటెలిజెన్స్ డీజీతోను నిందితుడు పిచ్చాపాటీ మీటింగ్ పెట్టుకున్నాడు.
సీఎం అండదండలు లేకపోతే ఇలా కూర్చోగలడా?
టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్ తో విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు.
తర్వాత ఎమ్మెల్యే తిరిగొస్తాడు గానీ నిందితుడు మాత్రం విదేశాల్లోనే ఆగిపోతాడు.
ఆ నిందితుడు ఎక్కడున్నాడని పోలీసులు ఎమ్మెల్యేను ప్రశ్నించరు, కేసులు పెట్టరు.
మరో ఎమ్మెల్సీ చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.
ఆయన సొంత అన్న.. కాల్‌మనీ కేసులో నిందితుడు. వీళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. అయినా ఈ ఎమ్మెల్సీ మీద కేసు పెట్టరు, కస్టడీలోకి తీసుకోరు, ప్రశ్నించరు.
చంద్రబాబు, లోకేష్ అండదండలతోనే కాల్ మనీ సెక్స్ రాకెట్ జరుగుతోంది
బీదలు, దళితుల మహిళల మాన,ప్రాణాలతో ఆడుకొని అశ్లీల వీడియో టేపులతో అడ్డగోలుగా దొరికిపోయారు
మహిళలను బలవంతంగా వేశ్య వృత్తిలోకి తీసుకొచ్చారు.
చంద్రబాబు, మంత్రులు,ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కాల్ మనీ సెక్స్ రాకెట్ లో ఉన్నారు
అందుకే చంద్రబాబు సాదా సీదా కేసుగా నీరుగార్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు
అంతటితో ఆగకుండా అసెంబ్లీలో ఈటాపిక్ రాకుండా చేసేందుకు అంబేద్కర్ గారి పేరు వాడుతున్నారంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు.
తన పాపం బయటపడుతుందనే నిండా మునిగిన పరిస్థితి నుంచి బయటపడేందుకు అంబేద్కర్ పేరు ఎత్తుతున్నారు
కాల్ మనీ కేసు నీరుగార్చేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నాడు