<br/>విజయనగరం: ప్రజా సంకల్పయాత్రకు చిన్నారుల అభిమానం తోడయింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న 281వ రోజు పాదయాత్రలో వైయస్ జగన్‌ను కలిసేందుకు స్కూల్ పిల్లలు క్యూకట్టారు. ఆ దారెంట వచ్చిన నడుచుకుంటూ వస్తున్న వైయస్ జగన్‌ను కలిసి మామయ్యా బాగున్నావా.. అంటూ ఆప్యాయంగా పలకరించారు. వైయస్ జగన్ ఏ గ్రామానికి వెళ్లినా ప్రజాభిమానం ఉప్పొంగుతూనే ఉంది. తమ కోసం తమ గ్రామాలకే వస్తున్న వైయస్ జగన్‌కు ప్రజలంతా ఘనస్వాగతం పలుకుతున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం కలవచర్ల వద్ద దంపతులిద్దరూ తమ బిడ్డకు నామకరణం చేయాలని వైయస్ జగన్‌ను కోరారు. ఆ తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు చిన్నారికి భవిష్ అని పేరు పెట్టారు.