ముగిసిన వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి దీక్షలు


ఏపీవ్యాప్తంగా తలపెట్టిన  వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేతల 48 గంటల దీక్షలు ముగిశాయి వైయస్‌ఆర్‌ జిల్లాలో విద్యార్థి నేతలకు ఎమ్మెల్యేలు, మేయర్‌  నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.  ఖాళీగా ఉన్న 2.12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగ యువత జీవితాలు, ఆకాంక్షలపై చంద్రబాబు సర్కార్‌పై నీళ్లు చల్లిందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు అన్నారు.  తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి దీక్ష విరమింపచేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర, నెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణ స్వామి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో చేపట్టిన దీక్షను విరమించారు. వైయస్‌ఆర్‌సీపీ రావి వెంకటరమణ  తదితరులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా,ప్రకాశం, నెల్లూరు, ,విశాఖ, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు,ఎమ్మెల్యేలు పాల్గొని  నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపచేశారు.
 


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top