స్థానిక సమస్యలు పట్టని బాబు

కుప్పం

: స్థానిక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కుప్పం ప్రజల సమస్యలు పట్టడంలేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జి, జెడ్పీ మాజీ చైర్మన్ ఎం.సుబ్రమణ్యంరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని దళవాయికొత్తపల్లె పంచాయతీ ఎన్టీఆర్ కాలనీలో కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు ఈ ప్రాంత అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడంలేదని, ఆయన తొమ్మిదేళ్ల పాలనలో సైతం కుప్పం ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న రైల్వేగేటు సమస్యతో కొత్తపేట వైపు ఉన్న ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని కొన్నేళ్లుగా ఈ సమస్యతో సతమతమవుతున్నా బాబుకు కనిపించకపోవడం దారుణమన్నా రు. దళవాయికొత్తపల్లె పంచాయతీ ఎన్టీఆర్ కాలనీకి చెందిన సుమారు వంద మంది ప్రజలు ఆదివారం వైయస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన ప్రముఖులలో డీకేపల్లె పంచాయతీ మాజీ సర్పంచ్ గిరిధర్‌రెడ్డి, విక్కీ, శబరి, రాజ, బాలు ఉన్నారు. పార్టీలో చేరిన వారికి సుబ్రమణ్యంరెడ్డి పూలమాలలు, పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అబ్బు, స్థానికులు కన్నన్, జంషడ్ బాషా, సతీష్,సెల్వం, ఏడీఎస్ శరవణ, డీకే పల్లె మణి, మంజు, సర్పరాజ్, యశోదమ్మ, కిరణ్, సలామత్, సారధి, హరియాదవ్ పాల్గొన్నారు.

Back to Top