జగన్‌ 'సమైక్య దీక్ష'కు విశేష స్పందన

హైదరాబాద్, 6 అక్టోబర్ 2013:

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు, ‌కడప ఎం.పి. శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న 'సమైక్య దీక్ష'కు రాష్ట్రం నలుమూలల నుంచి విశేష స్పందన లభిస్తోంది. హైదరాబాద్లో‌ని తన క్యాంపు కార్యాలయం వద్ద శ్రీ జగన్మోహన్‌రెడ్డి శనివారం ఉదయం నుంచి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షా శిబిరం వద్దకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. రెండవరోజు ఆదివారం దీక్ష కొనసాగిస్తున్న శ్రీ జగన్ను చూసేందుకు మహిళలు కూడా ‌భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.
సమైక్య దీక్ష చేస్తున్న శ్రీ జగన్‌కు రాష్టవ్యాప్తంగా సమైక్యవాదులు మద్దతు తెలుపుతున్నారు. శ్రీ జగ‌న్‌కు మద్దతుగా వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దీక్షలు చేస్తున్నారు. ‌రాష్ట్ర విభజన కోసం రూపొందించిన కేబినెట్‌ నోట్‌ను కేంద్ర కేబినెట్‌ ఆమోదించినందుకు నిరసనగా శ్రీ జగన్‌ ఇచ్చిన 72 గంటల రాష్ట్ర బంద్‌ను ప్రజలు విజయవంతంగా కొనసాగిస్తున్నారు. పలుచోట్ల రిలే దీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు.

శ్రీ జగన్ దీక్షకు మద్దతుగా చిత్తూరు జిల్లాలో నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. వైయస్ఆర్ జిల్లా పులివెందుల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ‌పార్టీ కార్యకర్తల దీక్షలు కొనసాగుతున్నాయి. శ్రీ జగన్ దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లాలో, విశాఖ జిల్లా నర్సీపట్నంలో 72 గంటల బం‌ద్ ‌విజయవంతంగా కొనసాగుతోంది. రైతులు, వ్యాపారులు, కార్మికులు, ఉద్యోగులు అందరూ బంద్కు మద్దతు తెలిపారు. ప్ర‌ధాన జాతీయ రహదారులన్నీ మూసివేశారు.

Back to Top