మహానేత వైయస్‌కు జననేత జగన్‌ నివాళులు

ఇడుపులపాయ (వైయస్ఆర్‌ జిల్లా), 9 నవంబర్ 2013: దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి శనివారం నివాళులు అర్పించారు. శ్రీ జగన్ సతీమణి‌ శ్రీమతి భారతితో కలిసి‌ శనివారం ఉదయం ఇడుపులపాయలోని వైయస్ఆర్ సమాధి వద్దకు చేరుకున్నారు. అనంతరం వారిద్దరూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఇడుపులపాయ వచ్చిన సందర్భంగా వచ్చిన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలను ఆయన పేరు పేరునా పలకరించారు. అనంతరం పులివెందుల బయల్దేరి వెళ్ళారు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత జిల్లాకు వచ్చిన శ్రీ వైయస్ జగ‌న్‌కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎ‌క్సుప్రెస్లో ఎర్రగుంట్లలో దిగిన ఆయన అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకున్నారు.

Back to Top