ఢిల్లీ ధర్నాకు విజ‌య‌వాడ నుంచి ప్రత్యేక రైలు

 అమరావతి: ప్రత్యేక హోదా సాధన కోసం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనే నాయకులు, కార్యకర్తల కోసం విజయవాడ నుండి ఢిల్లీకి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసన సభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులు శుక్రవారం (2వ తేదీ) సాయంత్రం 7 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి.  రైలు రాత్రి 10 గంటలకు  విజ‌య‌వాడ నుంచి బయలు దేరుతుంది. 5వ తేదీ ఢిల్లీ ధర్నా కార్యక్రమం ముగిసిన తర్వాత రాత్రి 9 గంటలకు అక్క‌డి నుండి రైలు తిరిగి బయలుదేరి 7వ తేదీ ఉదయం విజయవాడకు చేరుకుంటుంది. ధర్నా కార్యక్రమంలో పాల్గొనే పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం ఢిల్లీలో వసతి ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
Back to Top