ఎన్నిక‌ల్లో ప‌ద‌కొండున్న‌ర కోట్లు ఖ‌ర్చు పెట్టాన‌న్న స్పీక‌ర్ కోడెల‌

హైదరాబాద్: ఎన్నిక‌ల్లో విప‌రీతంగా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టాన‌ని స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం క‌లిగించాయి.  గత ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చు చేశానని గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసనసభ్యుడు, ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచ లనం సృష్టించాయి. వీటిపై అటు రాజకీయవర్గాలలోనూ, న్యాయవర్గాలలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది.

కోడెల ఏమ‌న్నారంటే..!
 కోడెల ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ‘నేను మొదట రాజకీయాల్లోకి వచ్చి 1983 ఎన్నికల్లో పోటీ చేసినపుడు రూ. 30 వేలు ఖర్చయ్యింది. ఆ 30 వేలల్లో కూడా గ్రామాలు, ప్రజల నుంచి చందాలు వచ్చాయి.   అలాంటిది మొన్నటి ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చయ్యింది. ఈ విధంగా డబ్బు ఖర్చు చేయాలంటే అవినీతి చేసే వారు కొంత మంది, ఆస్తులు అమ్మేవారు కొంత మంది, రెండూ కలిపి చేసేవారు కొంతమంది ఉన్నారు. పార్లమెంటు సభ్యుడి దగ్గర తీసుకునే వారు కూడా కొంతమంది ఉన్నారు. రాజకీయాల్లో డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. ఇది ఆరోగ్యకర పరిణామం కాదు. ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజాప్రతినిధులు సంపాదిం చారు కాబట్టి వారి దగ్గర డబ్బులు తీసుకోవటం సరైందేనని ప్రజలు అనుకుంటున్నారు. మా దగ్గర ప్రజలు డబ్బులు తీసుకున్నారు కా బట్టి సంపాదించుకోవాలని వారు (ప్రజాప్రతినిధులు) అనుకుంటున్నారు‘ అని అన్నారు.
 
నిబంధ‌న‌లు చూస్తే..!
 శాసనసభ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి వ్యయం పరిమితి ఉంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని  శాసనసభ స్థానానికి పోటీచేసే అభ్యర్థి వ్యయం రూ.28 లక్షలు, లోక్‌సభ స్థానానికి పోటీచేసే అభ్యర్థి వ్యయం రూ.70 లక్షలకు మించకూడదు. హర్యాణా, మేఘాలయ తదితర చిన్న రాష్ట్రాల నుంచి పోటీచేసే ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.22 లక్షలు, ఎంపీ అభ్యర్థికి రూ.54 లక్షలు వ్యయం మించకూడదు.
 
Back to Top