'విజయనగరం'లో ముగిసిన షర్మిల పాదయాత్ర

విజయనగరం, 21 జూలై 2013:‌

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‌అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయనగరం జిల్లాలో ఆదివారం సాయంత్రంతో ముగిసింది. విజయనగరం జిల్లాలో ఆమె 14 రోజులు పాదయాత్ర చేశారు. మొత్తం 198 కిలోమీటర్ల మేర ఆమె నడిచారు. జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు, 15 మండలాలు, 3 మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో ఆమె మరో ప్రజాప్రస్థానం కొనసాగించారు.

విజయనగరం జిల్లాలో పాదయాత్ర సందర్భంగా శ్రీమతి షర్మిల సీతానగరం ప్రాజెక్టు, తోటపల్లి రిజర్వాయర్‌ను సందర్శించారు. ఫెర్రో అలాయిస్, జూట్ కార్మికుల సమస్యలు‌ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు తమ సమస్యలు శ్రీమతి షర్మిలకు చెప్పుకున్నారు. తమ గ్రామాల్లో బెల్టు షాపులు ఎత్తివేయాలని షర్మిలకు పలువురు మహిళలు విజ్ఞప్తి చేశారు. పార్వతీపురం సభలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మీద శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

Back to Top