నెల్లూరు జిల్లాలో నేటి నుంచి సమైక్య శంఖారావం

నెల్లూరు, 8 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ‌ అధినాయకుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం నుంచి ప్రారంభమైంది. శనివారంనాడు వైయస్ఆర్ జిల్లాలో‌ సమైక్య శంఖారావం బస్సు యాత్ర చేసిన శ్రీమతి షర్మిల నేడు 8వ రోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం, కావలిలలో యాత్ర చేస్తారు. వైయస్ఆర్‌ జిల్లాలో ఆమె యాత్రకు అపూర్వ స్పందన లభిస్తున్నది. శ్రీమతి షర్మిలను చూసేందుకు గ్రామాలకు గ్రామాలే కదిలి వస్తున్నాయి. ఆమె ప్రసంగాలు వినడానికి సమైక్యవాదులు భారీగా తరలివస్తున్నారు. ఆత్మకూరు సభకు అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులు భారీ స్థాయిలో తరలివచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top