నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి

నెల్లూరు: నగరంలోని రైల్వే స్థలాల్లో నివసిస్తున్న నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. నగరంలోని 53వ డివిజన్‌ వెంకటేశ్వరపురం ప్రాంతంలో  ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సుమారు 50 సంవత్సరాల నుంచి రైల్వే స్థలాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయమని రైల్వే శాఖ అధికారులు నోటీసులు ఇస్తు ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై రెండేళ్లుగా కలెక్టర్‌తో చర్చలు జరిపామన్నారు. అసెంబ్లీలో సైతం ఇదే అంశంపై ప్రశ్నించామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు.రెవెన్యూ స్థలంగా మార్చిన జెన్‌కో భూమి 40 ఎకరాలు వీరికి కేటాయించి పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవరకొండ అశోక్, ఓబిలి రవిచంద్ర, నాయకులు నాగాసుబ్బారెడ్డి, నాగరాజు, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.

Back to Top