షర్మిల యాత్రకు అద్భుత స్పందన: వైవీ

కర్నూలు:

అధికార, ప్రతిపక్షాల కుట్ర వల్లనే వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కర్నూలు పట్టణంలో ఆయన గురువారం మధ్యాహ్నం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక స్థానాలలో గెలుపొందుతుందని ఆయన చెప్పారు. షర్మిల పాదయాత్రకు విపరీతమైన స్పందన వస్తోందని సుబ్బారెడ్డి తెలిపారు.

Back to Top