షర్మిల పాదయాత్రలో శాసనసభ్యులుపులివెందుల, 24 అక్టోబర్ 2012 : వైయస్ఆర్ కడప జిల్లాలో సుమారు ఆరు రోజుల పాటు 82.5 కిలోమీటర్ల మేర సాగిన షర్మిల పాదయాత్రలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వీలు చిక్కినప్పుడల్లా పాదయాత్రలో పాల్గొనగా, పార్టీ నేత వైవి. సుబ్బారెడ్డి  పూర్తిగా పాదయాత్రలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీ డి.నారాయణరెడ్డితో పాటు వైయస్ఆర్ జిల్లా శాసనసభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, కె.శ్రీనివాసులు పాదయాత్రలో పూర్తిగా పాల్గొన్నారు.  అలాగే పొరుగు జిల్లాలకు చెందిన పలువురు శాసనసభ్యులు యాత్రలో ఒకటి రెండు రోజులు నడిచారు. వీరిలో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, శోభానాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రెండు రోజులు పాదయాత్రలో షర్మిల వెంట నడిచారు. ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి మొదటి నుంచీ  పాదయాత్రలో నడుస్తున్నారు. ఎమ్మెల్సీలు శేషుబాబు, దేశాయి తిప్పారెడ్డి తదితరులు వైయస్ఆర్ జిల్లాలో పాదయాత్రలో పాల్గొన్నారు. మాజీ మంత్రి కొండాసురేఖ, పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, కేకే మహేందర్‌రెడ్డి తదితరులు తొలి మూడురోజులు మరో ప్రజాప్రస్థానంలో పాల్గొన్నారు.

Back to Top