<img style="width:225px;height:292px;margin:4px;float:right" src="/filemanager/php/../files/chigic.jpg"><strong>అనంతపురం</strong> 28 అక్టోబర్ 2012 : షర్మిల పాదయాత్ర రాష్టంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ఆసక్తి రేపుతోంది. పలువురు ప్రవాసభారతీయులు షర్మిల యాత్రకు మద్దతు ప్రకటిస్తున్నారు. విదేశాలలో సంఘీభావంగా పాదయాత్రలు నిర్వహి స్తున్నారు. అంతేకాదు కొందరు స్వయంగా స్వదేశానికి వచ్చి షర్మిల మరో ప్రజా ప్రస్థానంలో పాల్దొంటున్నారు. అమెరికా నుంచి పవన్‌కుమార్, అమర్‌జీవ్, అవినాశ్, వేణుగోపాల్‌రెడ్డి, వైయస్ఆర్ సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం సభ్యత్వ సమన్వయకర్త సుధాకర్‌రెడ్డి అనంతపురం జిల్లాకు వచ్చి పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. పవన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు షర్మిల పాదయాత్ర ఉపకరిస్తుందన్నారు. వైయస్ఆర్ సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్ ఆధ్వర్యంలో తాము యాత్రలో పాల్గొన్నట్లు వారు తెలిపారు. కువైట్, డల్లాస్ నుంచి మరికొందరు కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు.<br>షర్మిలకు వైద్యపరీక్షలు :<br>ఇదిలావుండగా షర్మిలకు శుక్రవారం రాత్రి నుంచే జ్వరం వచ్చి నీరసంగా కనిపించారు. రాత్రి 101.8 డిగ్రీల జ్వరం ఉందని, రెండు రోజులుగా తీవ్ర జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారని షర్మిల చిన్నాన్న కుమారుడు, వైయస్ఆర్ సీపీ నాయకులు వైయస్ అవినాశ్ రెడ్డి మీడియాకు చెప్పారు. అయితే శనివారం సాయంత్రానికి జ్వరం కాస్త తగ్గిందనీ, అనంతపురం నుంచి రిమ్స్ వైద్య నిపుణుడు డాక్టర్ వెంకటేశ్వరరావు షర్మిలకు వైద్య పరీక్షలు చేశారనీ ఆయన తెలిపారు. పులివెందుల నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి మామగారు, అత్తగారు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, డాక్టర్ సుగుణమ్మ కూడా వచ్చి షర్మిలను పరీక్షించారు. కాగా, షర్మిల శనివారం జ్వరంగా ఉండడంతో యాత్రను వైద్యుల సలహా మేరకు కుదించిన సంగతి తెలిసిందే. ఆరు కిలోమీటర్లు నడవాలని తొలుత నిర్ణయించినా ఆమె శనివారం. 8.5 కి.మీలు నడిచారు. పార్టీ గౌరవా ధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సాయంత్రం పాదయాత్రలోను, చిగిచర్ల సభలోనూ పాల్గొన్నారు. వైయస్ ఆర్ సీసీ నాయకులు ఎం వి మైసూరారెడ్డి, పార్టీ శాసనసభ్యుడు కాపు రాంచంద్రారెడ్డి, ఆయన సతీమణి భారతి, మరో శాసనసభ్యుజు జి. గురునాథరెడ్డి, ఆయన సతీమణి మాధవి, వాసిరెడ్డి పద్మ తదితరులు పాదయాత్రలో షర్మిలతో కలిసి నడిచారు..