షర్మిల పాదయాత్రకు డాక్టర్ల మద్దతు

హైదరాబాద్, 26 మార్చి 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా కృష్ణాజిల్లాలో పార్టీ అనుబంధ వైద్య విభాగం తరఫున 1000 మంది డాక్టర్లు పాల్గొననున్నట్లు ఆ విభాగం కన్వీనర్ గోసుల శివభరత్‌రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆవిష్కరించారు. అనంతరం శివభరత్ మాట్లాడుతూ... షర్మిల పాదయాత్రకు మద్దతుగా కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద వెయ్యి మంది డాక్టర్లు సంఘీభావం తెలపుతూ పాదయాత్రలో పాల్గొంటారన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్ వల్ల లబ్దిపొందిన వైద్య విద్యార్థులు, 108, 104, ఆరోగ్యశ్రీ సిబ్బంది కూడా పాల్గొని శ్రీమతి షర్మిలకు వారు పడుతున్న ఇబ్బందులను వివరించనున్నట్లు తెలిపారు.

Back to Top