షర్మిల నేటి పాదయాత్ర ఇలా...

అనంతపురం :

మహానేత వైయస్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం భంభం బాబా గుట్ట నుంచి ప్రారంభమై పెన్నహోబిలం, పీఏబీఆర్ కాలువ, కోనాపురం క్రాస్, కోనాపురం, షెక్షాన్‌పల్లి, లత్తవరం సరిహద్దు వరకు సాగుతుంది. షెక్షాన్‌పల్లి బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం లత్తవరం సరిహద్దులో ఏర్పాటు చేసిన గుడారంలో రాత్రి బస చేస్తారు. శుక్రవారం ఆమె 12.5 కిలోమీటర్లు నడుస్తారని కార్యకర్త సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం నాడు షర్మిల పాదయాత్ర లత్తవరం సరిహద్దు నుంచి ప్రారంభమవుతుంది. ఉరవకొండ పట్టణంలో సాగుతుంది. షర్మిల ఉరవకొండ పాతబస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని అనంతరం మార్కెట్ యార్డు వద్ద రాత్రి బస చేస్తారు.

తాజా ఫోటోలు

Back to Top