షర్మిల నేటి మరో ప్రజాప్రస్థానం సాగేదిలా..

గుంటూరు, 20 మార్చి 2013 : మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ, జననేత, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 96వ రోజు బుధవారం వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు జిల్లా కన్వీనర్‌ మర్రి రాజశేఖర్, పార్టీ కార్యక్రమాల ‌రాష్ట్ర కో ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌ బుధవారంనాటి శ్రీమతి షర్మిల పాదయాత్ర వివరాలను తెలిపారు.

గుంటూరు జిల్లా పెదపూడి శివారు నుంచి బుధవారం ఉదయం శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి కూచిపూడి మీదుగా ముందు సాగి మధ్యాహ్న భోజన విరామ కేంద్రానికి ఆమె చేరుకుంటారు. అనంతరం పెదరావూరు, జగ్గడిగుంటపాలెం, చినరావూరు, స్వరాజ్ టాకీస్ రోడ్‌, వాహెబ్‌రోడ్‌ (సత్యనారాయాణ టాకీస్‌ రోడ్), మెయిన్‌ ‌రోడ్‌ మీదుగా పురవేదిక వద్దకు చేరుకుంటారు. పురవేదిక వద్ద జరిగే బహిరంగసభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. అక్కడి నుంచి బుధవారం రాత్రి బసకు ఆమె చేరుకుంటారని రాజశేఖర్‌, రఘురామ్‌ వివరించారు.
Back to Top