షర్మిల నేటి మరో ప్రజాప్రస్థానం షెడ్యూల్‌ ఇదీ

మహబూబ్‌నగర్, ‌6 డిసెంబర్‌ 2012: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 50వ రోజు గురువారం గురువారం నాటి షెడ్యూల్‌ను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌, పాలమూరు జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి ‌ప్రకటించారు. శ్రీమతి షర్మిల బుధవారం రాత్రి బస చేసిన జడ్చర్ల నుంచి గురువారం ఉదయం పాదయాత్ర ప్రారంభిస్తారని వారు తెలిపారు. అనంతరం గంగాపూర్, గోప్లాపూ‌ర్ క్రా‌స్, లింగంపేట, కోడగ‌ల్, మట్టపల్లి ‌తండా, నల్లకుంట క్రాస్ మీదుగా కొందేడు చేరుకుంటా‌రని వారు వివరించారు. కొందేడులో ఏర్పాటు చేసిన గుడారంలో శ్రీమతి షర్మిల గురువారం రాత్రికి బస చేస్తారని వారు తెలిపారు. గురువారంనాడు శ్రీమతి షర్మిల 18.7 కిలోమీటర్లు నడుస్తారని రఘురామ్‌, కిష్టారెడ్డి తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top