<br/><br/>హైదరాబాద్) వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఈ నెల 24 నుంచి వరంగల్ జిల్లాలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకస్మిక మరణాన్ని తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అకస్మిక మరణానికి లోనైన సంగతి తెలిసిందే. ఇటువంటి కుటుంబాల్ని పరామర్శించాలని, పలకరించి ఓదార్చాలని అప్పుడే వైఎస్ జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన అనేక జిల్లాల్లో పర్యటించి, సంబంధిత కుటుంబాల్ని పలకరించి వచ్చారు తర్వాత కాలంలో ఆయన మాట మేరకు ఆయన సోదరి వైఎస్ షర్మిల పర్యటన చేపట్టారు. తెలంగాణ లో నాలుగు జిల్లాల్లో ఇప్పటికే పరామర్శ యాత్ర పూర్తయింది.వరంగల్ జిల్లాలో మొదటి విడత పరామర్శ యాత్ర కు షెడ్యూల్ ఖరారు చేశారు. మొదట విడతలో భాగంగా వైఎస్ షర్మిల 32 కుటుంబాల్ని పరామర్శిస్తారు. షర్మిల యాత్రకు తెలంగాణలోని వైఎస్సార్ సీపీ నేతలు హాజరు కానున్నారు. <br/>