అస్తర్బీ, నర్సింహ కుటుంబాలకు షర్మిల పరామర్శ

నల్గొండ: వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల నల్గొండ జిల్లాలో రెండో విడత పరామర్శ యాత్ర మూడో రోజు  కొనసాగుతుంది. నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ముందుగా నాంపల్లికి చెందిన అస్తర్బీ కుటుంబాన్ని వైఎస్ షర్మిల గురువారం ఉదయం పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అలాగే తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన రాయించు నర్సింహ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.   గుంటి వెంకటేశం కుటుంబం, ఇదే నల్గొండ  మండలం చందనపల్లి గ్రామానికి చెందిన చింతా భిక్షమయ్య కుటుంబం, అదే విధంగా నల్లగొండ పట్టణంలో దండేకార్ దయానంద్ కుటుంబం,  మర్రిగూడెం మండలం తాన్‌దార్‌పల్లి గ్రామానికి చెందిన మునగాల పుల్లమ్మ కుటుంబంతో  పాటు చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బిట్ర వసంతరావు కుటుంబ సభ్యులను షర్మిల కలిసి మేమున్నామంటూ భరోసా ఇవ్వనున్నారు.
Back to Top