శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తా

నెల్లూరుః నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం అహ‌ర్నిశ‌లు పాటుప‌డ‌తాన‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ద‌ళిత‌వాడ‌ల అభివృద్ధి కోసం ప‌నులు ప్రారంభించి ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్న న‌గ‌ర క‌మిష‌న‌ర్‌ని ఎమ్మెల్యే ఘ‌నంగా స‌త్కరించారు. క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో పార్టీ నాయ‌కుల‌తో త‌ర‌లివెళ్లి పూల‌బొకే ఇచ్చి అభినందించారు. విలీన గ్రామాల, శివారు కాల‌నీల అభివృద్ధికి ప్ర‌త్యేక గ్రాంట్ సాధ‌న కోసం శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని ఎమ్మెల్యే అన్నారు. న‌గ‌ర ప్ర‌జ‌ల‌పై ప‌డ్డ వెయ్యి కోట్ల అప్పుల భారం లేకుండా చేయాల్సిన బాధ్య‌త కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌, రాష్ట్ర‌మంత్రి నారాయ‌ణ‌ల‌దేన‌ని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో ఉన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top