సర్వం బంద్‌... పాలు, నీరు, వైద్యం తప్ప

హైదరాబాద్‌, 30 ఆగస్టు 2012 : రాష్ట్ర ప్రభుత్వం విచక్షణ లేకుండా విధిస్తున్న విద్యుత్‌ కోతలకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం నిర్వహించే రాష్ట్ర బంద్‌లో అన్న వర్గాల ప్రజలు, వ్యవస్థలు సంపూర్ణంగా పాల్గొనాలని పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు విజ్ఞప్తి చేశారు. బంద్‌ నుంచి పాలు, మంచినీటి సరఫరా, వైద్య రంగాలను మినహాయించినట్లు ఆయన స్పష్టం చేశారు. బంద్‌ను భగ్నం చేసేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షం ప్రచారం చేసే వదంతులను నమ్మవద్దని ఆయన తెలిపారు. విద్య, వ్యాపార, వాణిజ్య, రవాణా, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు బంద్‌ పాటించాలని జూపూడి కోరారు. పార్టీ కేంద్ర కార్యాయలంలో ఆయన గురువారంనాడు పత్రికా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వైయస్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ బంద్‌ పిలుపు ఇచ్చారని, పార్టీ కార్యకర్తలు, నాయకులు బంద్‌ విజయవంతం అయ్యేలా కృషిచేయాలని జూపూడి విజ్ఞప్తి చేశారు. బంద్‌ సందర్భంగా తమ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టినా, అరెస్టులు చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.

Back to Top