నిల‌క‌డ‌గా సామ్యూల్స్ ఆరోగ్యం

రంగంపేట: ఇటీవల రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి రాజానగరం జిఎస్‌ఎల్ ఆసుపత్రిలో చికిత్స‌ పొందుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుడాల సామ్యూల్ ఆరోగ్యం నిలకడగా వుందని పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ డాక్ట‌ర్ సూర్య‌నారాయ‌ణ‌రెడ్డి తెలిపారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎలాంటి ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని చెప్పారు.  శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా సామ్యూల్స్ కాళ్లకు తగిలిన గాయాల‌కు వైద్యులు శస్త్ర చికిత్స చేశారని, ప్రస్తుతం ఆయన కోలుకొంటున్నారన్నారు. వైద్యులు సామ్యూల్‌కు కాస్త విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని చెప్పార‌న్నారు. 

Back to Top