హైదరాబాద్) అవిశ్వాస తీర్మానం మీద ప్రభుత్వం మళ్లీ అదే నాటకాలకు తెర దీసింది. నోటీసు ఇచ్చిన వెంటనే చర్చకు పెట్టేయాలని నిర్ణయించుకొంది. దీని మీద నిబంధనల పొజిషన్ ను చెప్పేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రభుత్వ పక్షం అడ్డు పడింది. నోటీసు ఇచ్చిన తర్వాత 14 రోజుల గడువు ను నిర్దేశిస్తున్న నిబంధన ను సస్పెండ్ చేయాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామక్రిష్ణుడు ప్రతిపాదించారు. మంది బలం ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పక్షం దీన్ని బలపర్చటంతో నిబంధనల్ని రద్దు చేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు. దీనికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అభ్యంతరం చెబుతున్నప్పటికీ పట్టించుకోలేదు. వెంటనే అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు అనుమతిస్తున్నామని రూలింగ్ ఇచ్చేశారు. దీనికి సంబంధించి సభ్యులకు విప్ జారీ చేసే అవకాశాన్ని ప్రతిపక్షాలకు లేకుండా చేసి కుట్రలు అమలు చేశారు.