సొమ్మసిల్లిన రోజా..నిమ్స్ కు తరలింపు


  • ఉదయం నుంచీ ఎమ్మెల్యే రోజా గాంధేయ మార్గంలో నిరసన
  • మండుటెండలో నిలిపివేసిన పచ్చ ప్రభుత్వం
  • సొమ్మసిల్లటంతో ఆస్పత్రికి తరలింపుహైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వ పైశాచికత్వం మీద మహిళా ఎమ్మెల్యే రోజా గాంధేయ
మార్గంలో నిరసన తెలిపారు. అసెంబ్లీ దగ్గర ఆమె సొమ్మసిల్లిపోయారు. దీంతో ఆమెను
చికిత్స కోసం నిమ్స్ కు తరలించారు.


      హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో మహిళా
ఎమ్మెల్యే రోజా శాసనసభ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అధికార తెలుగుదేశం పార్టీ
అహంకారంతో శాసనసభ వర్గాలతో ఆమెను నిలువరించారు. మండు టెండల్లో నడిరోడ్డు మీద ఆమె
నిరసన తెలిపారు.

      ఎప్పటికీ ప్రభుత్వంలో చలనం
లేకపోవటంతో ఆమె నిరసనకు దిగారు. ఎండలు తీవ్రంగా ఉండటం, అప్పటికే అనారోగ్యంతో
ఉండటంతో ఆమె   సొమ్మసిల్లిపోయారు. దీంతో
ఆమెను నిమ్స్ కు తరలించారు. 

Back to Top