<br/><br/>చిత్తూరు) మహిళలకు రక్షణ కల్పించే అంశాన్ని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చిత్తూరుజిల్లా లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు మహిళల రక్షణ కోసం చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. తీరా ఎన్నికల్లో గెలిచాక, వాటిని గాలికి వదిలేశారని ఆమె ఆరోపించారు. అంగన్ వాడీ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు ప్రచారం చేసుకొన్నారని రోజా చెప్పారు. ఇప్పుడు ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు, ఉన్న ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నారని ఆమె వివరించారు. బాలికల సంరక్షణ పథకాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని ఆమె అన్నారు. రిషితే్శ్వరి మరణానికి కారకులైన వారి మీద సరైన చర్యలుతీసుకోలేదని రోజా ఆరోపించారు.<br/><br/>