చంద్రబాబు విదేశిపర్యటనలు ఆపితే మంచిది: రోజా

విశాఖ: మహిళా సమస్యలు, బెల్ట్ షాపులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని నగరి ఎమ్మెల్యే  రోజా అన్నారు. ఆమె బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  సింగపూర్, మలేషియా టూర్లు ఆపితే ప్రజా సమస్యలు తెలుస్తాయన్నారు.

చంద్రబాబు మలేషియా, సింగపూర్, చైనా పర్యటన ఎందుకు చేస్తున్నారో  ఆపార్టీకే స్పష్టత లేదన్నారు. అంగన్వాడీ కార్యకర్తల లాఠీఛార్జ్ ఘటనలో 14మందిని సస్పెండ్ చేయటం దారుణమని రోజా అన్నారు.
Back to Top