పదవుల కోసం గాడిద కాళ్లు కూడా పట్టుకునే రకం బాబు

 
ప్రకాశం : పదవుల కోసం గాడిద కాళ్లు కూడా పట్టుకునే రకం చంద్రబాబు అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను ఓడించండి అన్న చంద్రబాబు..ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కౌగిలించుకుంటున్నారు..  చంద్రబాబు నాయుడుకు కౌట్‌డౌన్ మొద‌లైంద‌ని హెచ్చ‌రించారు. పచ్చపత్రికల అండతో టీడీపీ రెచ్చిపోతుందని, వైయ‌స్ భారతిపై కావాలని బురద జల్లుతున్నారని మండిప‌డ్డారు. చంద్రబాబు ఇంట్లో వాళ్లను కూడా బయటకు లాగే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. ఓటుకు నోటు కేసులో బాబు అడ్డంగా దొరికినా అరెస్ట్‌ చేయలేదు..టీడీపీ నేత సుజానా చౌదరీ బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన దొంగ..అలాంటి వారు కూడా భారతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైయ‌స్‌ జగన్‌ ప్రజల తరపున పోరాటం చేస్తుంటే ఓర్వలేకనే చంద్రబాబు కుట్ర రాజకీయాలకు తెరలేపారని వ్యాఖ్యానించారు.

 చంద్ర‌బాబు, ఆయన అనుచరగణం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దోచుకుని సింగపూర్‌లో దాచుకుంటున్నారని   రోజా ఆరోపించారు.  టీడీపీ మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారు..వాళ్లు ఆడవారో మొగవారో తెలియటం లేదని ఎద్దేవా చేశారు. వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై కేసు పెట్టిన ఏడేళ్ల తర్వాత ఆయన సతీమణి వైయ‌స్‌ భారతిపై కేసు పెట్టడం ఒక కుట్ర అని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో టీడీపీ కుమ్మక్కై విర్రవీగుతున్నారని మండిపడ్డారు. మీ ఇంట్లో వాళ్లను కూడా కోర్టుకు లాగే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. వైయ‌స్ జగన్‌పై పెట్టిన కేసులు వీగిపోతున్నాయని..అది తట్టుకోలేకే భారతిపై రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు.  బీజేపీతో కొట్లాడుతున్నట్లు నటిస్తూ టీడీపీ లోలోపల కుమ్మక్కు అయింది..వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాసం పెడితే తీసుకోలేదు..టీడీపీ పెడితే తీసుకున్నారు..ఇదే కుమ్మక్కుకు నిదర్శనమన్నారు. 
Back to Top