చంద్ర‌బాబు చేత‌గాని ద‌ద్ద‌మ్మ‌: ఆర్కే రోజా

కాకినాడః 2014 ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌టి అమ‌లు చేయ‌ని చంద్ర‌బాబుకు కాకినాడ కార్పొరేష‌న్‌ ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు బుద్ధి చెప్పాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌హిళా అధ్య‌క్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా పిలుపునిచ్చారు. కాకినాడ 33వ వార్డులో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి అరుణ‌తో క‌లిసి రోజా ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రోజా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. కార్పొరేష‌న్ లో ఇంత‌కాలంగా ఎన్నిక‌లు పెట్ట‌ని చేత‌గాని దద్ద‌మ్మ చంద్ర‌బాబు నాయుడు అని విమ‌ర్శించారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు పూర్తిగా రుణ‌మాఫీ చేస్తాన‌ని చెప్పి మాఫీ చేయ‌కుండా ముక్కుపండి వారి నుంచి వ‌డ్డీలు వ‌సూలు చేస్తున్నార‌న్నారు. నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు లేని ప‌క్షంలో రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తాన‌ని చెప్పి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చాడా అని ప్ర‌శ్నించారు. కానీ త‌న ఇంట్లో బుర్ర‌లేని లోకేష్‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి మంత్రిని చేశాడ‌న్నారు. ఉన్న‌త చ‌దువులు చ‌దివిన పేదోడి బిడ్డ‌కు ఉద్యోగం ఇవ్వ‌లేని చంద్ర‌బాబు బుద్ధి చెప్పాల‌న్నారు. 

Back to Top