ఎమ్మెల్యే ఆర్కే పుట్టిన రోజు వేడుకలు

మంగళగిరి : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పుట్టిన రోజు వేడుకలను బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలను ఎమ్మెల్యే మరిన్ని జరుపుకొని ఉన్నత పదవులను అలంకరించి ప్రజా సేవలో నిమగ్నమవ్వాలని ఆకాంక్షించారు. ఆర్కే పుట్టిన రోజు సంద‌ర్భంగా ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యే ఆర్కేకు నాయకులు ఫోన్‌లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

వైయ‌స్ఆర్‌ విగ్రహం వద్ద..
పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలోని వైయ‌స్ఆర్‌ విగ్రహం వద్ద 32, 31 వార్డుల వైయ‌స్ఆర్‌ సీపీ యూత్‌ నాయకులు సయ్యద్‌ గౌస్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆర్కే పుట్టిన రోజు వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. మండలంలోని నవులూరు షారోన్‌ అనాధ ఆశ్రమంలో చిన్నారుల‌ మధ్య పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. బాల బాలికలకు అన్నదానం చేసి, మిఠాయిలు, పండ్లు పంచిపెట్టారు. ఆర్కే పుట్టిన రోజు కార్యక్రమాల్లో వైయ‌స్సార్‌ సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు చిల్లపల్లి మోహనరావు, పార్టీ మండల, పట్టణ కన్విన‌ర్లు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మునగాల మల్లేశ్వరరావు, ఎంపీపీ పచ్చల రత్నకుమారి, పార్టీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ సంకె సునీత, కౌన్సిలర్‌ మేరుగమల్లి వెంకటరమణ, నవులూరు సర్పంచ్‌ బాణావత్‌ బాలాజి నాయక్, పార్టీ జిల్లా కార్యదర్శులు పచ్చల శ్యాంబాబు, ఈపూరి ఆదాం, మాబు, నసీముల్లా, తాడిబోయిన బాపయ్య, అనుబంధ సంఘాల కన్వినర్లు మహ్మద్‌ ఫిరోజ్, ఆకురాతి రాజేష్, షేక్‌ శ్రీను, కంచర్ల వెంకయ్య, సంకె ప్రతాప్, కురగంటి ఆదాం, పార్టీ యూత్‌ విభాగం నాయకులు బిజిలి, వెనిగళ్ళ నాగేశ్వరరావు, బాబు, రబ్బాని, బషీర్, షేక్‌ మెహరాజ్, గాదె సాగర్‌రెడ్డి, కొల్లి శేషిరెడ్డి, సుబ్బారావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Back to Top