<br/><br/>వైఎస్సార్‌కడపజిల్లా ) ఆచార్య నాగార్జున యూనివర్శిటీ లో ఆత్మహత్య చేసుకొన్న రిషితేశ్వరి మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా లో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. కడప నగరంలో భారీ ర్యాలీ తీయటంతో పాటు మానవ హారాన్ని నిర్వహించారు. ఇప్పటికైనా నిందితుల్ని అరెస్టు చేయాలని విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది.