<img style="margin-left:5px;margin-top:5px;float:right" src="http://pdf.ysrcongress.com/filemanager/files/News/VasireddyPadma2.jpg" height="142" width="211">హైదరాబాద్, 6 సెప్టెంబర్ 2012 : ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎలాగైనా తుంగలో తొక్కేయాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నిశితంగా విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ ఏదో మోయలేని బరువుగా ఎందుకు భావిస్తుందో వివరించాలని ఆమె డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సామాజిక పెట్టుబడిగా భావించాలని ప్రభుత్వానికి పద్మ సూచించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించిన ఫీజు దీక్షా శిబిరం వద్ద ఆమె మాట్లాడారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే ఇంటిలో ఎలుకలు జొరబడ్డాయని.. ఏకంగా ఇంటినే తగలబెట్టుకున్నట్లు ఉందని వాసిరెడ్డి పద్మ అభివర్ణించారు.