టికెట్ ఇవ్వకపోతే ఆదికి భవిష్యత్తే లేదు

ఎర్రగుంట్ల: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతి పక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ తరపున ఎమ్మెల్యేగా టికెట్‌ ఇవ్వక పోతే మంత్రి ఆదినారాయణరెడ్డికి రాజకీయ భవిష్యత్‌ ఉండేది కాదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. వైయస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని నిడుజివ్వి గ్రామంలో పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇంచార్జ్ ఎం. సుధీర్‌రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2014లో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కాలుపట్టుకుంటే అప్పుడు ఆదికి టికెట్‌ ఇచ్చారని, అప్పుడే ఇవ్వక పోయి ఉంటే ఎమ్మెల్యే అయిండేవారు కాదని తెలిపారు. ఇప్పుడు పార్టీ మారి బాబు మెప్పు కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  పులివెందులలో నంద్యాల ఫార్ములా పాటిస్తామని చెప్పడం హాస్సాస్పందంగా ఉందన్నారు.


చంద్రబాబు పాలనలో అరాచకం పెరిగిపోయిందన్నారు. ఈ మూడున్నరేళ్ల పాలనలో కేవలం కమిషన్‌ల కొరకే సీఎం పనిచేశారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. గండికోట, సర్వరాజసాగర్, వామికొండ ప్రాజెక్టులకు ఇంత వరకు నీరు ఇవ్వలేదన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు అల్లాడుతున్నారని చెప్పారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే జలయజ్ఞంతో ప్రాజెక్టులు పూర్తి అయి నీటితో నిండి రైతులకు భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఎస్‌ ప్రసాద్‌రెడ్డి, గంగాక్రిష్ణారెడ్డి, జయరామక్రిష్ణరెడ్డి, ప్రొద్దుటూరు కొనేటి రామచంద్రరెడ్డి, రఘునందన్‌రెడ్డిలు పాల్గొన్నారు. 
Back to Top