రైతుల, పేదల పెన్నిధి వైయస్‌ఆర్

అశ్వారావుపేట:

రాష్ట్రంలో తొలిసారిగా రైతుల రుణాలను మాఫీ చేసి వారి కుటుంబాల్లో వెలుగు నింపిన ఘనత దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బాణోతు పద్మావతి అన్నారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సహకార ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకోవాలని ఆమె రైతులకు పిలుపునిచ్చారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు దివంగత మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి 1470 కిలోమీటర్ల పాదయాత్ర చేశారనీ, ముఖ్యమంత్రయిన తర్వాత ఉచిత విద్యుత్తు మంజూరు,  రుణాలను మాఫీ చేస్తూ సంతకాలు చేశారని ఆమె గుర్తు చేశారు. సహకార సంఘాలను బలోపేతం చేసిన ఘనత  రాజన్నకే దక్కుతుందన్నారు. తెలుగుదేశం హయాంలో అప్పులపాలైన రైతులకు బ్యాంక్‌లు ద్వారా రుణం అందించింది, నిరుపేద రైతులను ఆదుకుంది డాక్టర్ రాజశేఖరరెడ్డి మాత్రమేనన్నారు.

రాజన్న ఆశయ సాధన జగన్‌కే సాధ్యం

     దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్  జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమన్నారు. ఈ నెల 31న సహకార ఎన్నికల్లో తమ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలుపించాలని కోరారు.

Back to Top