'రాజన్నరాజ్యం'తోనే కష్టాలు తీరతాయి: షర్మిల

పులివెందుల, 21 అక్టోబర్ 2012 : రాజన్న రాజ్యంతోటే ప్రజల కష్టాలు తీరుతాయని వైఎస్ షర్మిల అన్నారు. ఆదివారం ఉదయం పులివెందుల నుంచి నాల్గవ రోజు పాదయాత్ర ప్రారంభించిన ఆమె రింగ్ రోడ్డు వద్ద కాసేపు విద్యార్థులతో మాట్లాడారు. కరెంటు కోతలతో చదువుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని ఓ విద్యార్థిని షర్మిల దృష్టికి తేగా, ముఖ్యమంత్రి మొద్దునిద్ద  వల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని ఆమె వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాలూ విద్యుత్తును కొనుగోలు చేస్తున్నా, మన సిఎం మాత్రం చోద్యం చూస్తూ కాలక్షేపం చేశారని షర్మిల విమర్శించారు.

Back to Top