రాజకీయంగా ఎదుర్కోలేకే జగన్‌పై కుట్ర: గుర్నాధ రెడ్డి

అనంతపురం:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే  ఆయనపై కుట్ర చేసి జైలులో ఉంచారని పార్టీ ఎమ్మెల్యే గుర్నాధ రెడ్డి చెప్పారు. అనంతపురం పట్టణంలోని గుత్తి రోడ్డులో ట్రేడ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు వాయల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన సంతకాల సేకరణ  కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని సర్కారుపై గళం విప్పిన జననేతను ఆయన కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సమర్పించనున్న కోటి సంతకాలతో న్యాయం చేకూరుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్ పీరా, వైఎస్సార్ సీపీ ముఖ్య అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు మారుతీ నాయుడు, కసునూరు రఘునాథ్ రెడ్డి, కణేకల్ లింగా రెడ్డి, శ్రీదేవి, కృష్ణవేణి, ఉషారాణి, లలిత, కదిరి నిర్మల, అంకిరెడ్డి ప్రమీళ తదితరులు పాల్గొన్నారు.

Back to Top