వైయస్ జగన్‌ పై అక్రమ కేసులకు నిరసనగా ధర్నా

ఉరవకొండ: దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటన పై ప్రశ్నించిన ప్రతిపక్ష నేత ౖవైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పై ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులకు నిరసనగా గురువారం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట «నల్లబ్యాడ్జిలు ధరించి ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు మాట్లాడుతూ బస్సు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం ఏ తరహ ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. డ్రైవర్‌  మృతుదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండానే అక్కడి నుండి తరలించుకోని పోవడం ఎంత వరకు సబబు అని, దీని పై ప్రశ్నిస్తే కేసులు బానాయిస్తారా అంటూ మండిపడ్డారు.. మండల, పట్టణ కన్వీనర్‌లు వెలిగొండ నరసింహులు, తిమ్మప్పలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతూ సొంత పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌కు చెందిన బస్సు ట్రావెల్స్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. ప్రమాదంలో 11 మంది మృతి చెందిన కనీసం పరామర్శించడానికి కూడా చంద్రబాబు వెళ్లలేదన్నారు. ప్రతిపక్ష నేత పరామర్శించడానికి వెళితే తప్పేంటని ప్రశ్నించారు. అనంతరం తహసీల్దార్‌ బ్రహ్మయ్యకు నాయకులు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా కమీటి సభ్యులు నిరంజన్‌గౌడ్, ఆంజినేయులు, చేనేత విభాగం జిల్లా కమీటి సభ్యులు చెంగలమహేష్, గట్టుఎ్రరిస్వామి, వార్డు సభ్యులు రాయల్‌ మల్లి, శర్మాస్, లెనిన్, ప్రభాకర్,  రాజ, బూదగవి ధనంజయ తదితరులు పాల్గొన్నారు.

Back to Top