ప్రజాస్వామ్య పరిరక్షణకే వైయస్‌ జగన్‌ పాదయాత్ర

ఇడుపులపాయ: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నేడు మన నాయకులు వైయస్‌ జగన్‌ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏ నేపథ్యంలో వచ్చిందో నాకు మళ్లీ గుర్తుకు వస్తోంది. ఆ నాడు మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం పేరుతో ఆ నాడు పాదయాత్ర ప్రారంభించారు. ఆ నాడు ప్రజలకు ధైర్యం చెప్పేందుకు పాదయాత్ర చేస్తే..మళ్లీ అదే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి.  ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర మొదలుపెట్టారు. జన్మభూమి కమిటీలతో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందుల పాలు చేశారు. శాసన సభలో 22 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్పించుకోని, మంత్రి వర్గంలో నలుగురిని పెట్టుకొని ప్రతిపక్షంతో ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రభుత్వాన్ని దేశంలోనే ఏపీని చూస్తున్నాం. అవినీతి పాలన సాగుతోంది. రాజధాని పేరుతో సేకరించిన భూమిని విదేశాలకు, కార్పోరేట్‌ కంపెనీలకు కట్టబెట్టారు. రహస్యంగా 2 వేల జీవోలు విడుదలు చేశారు. ఎంత దొంగ ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తుందో అర్థం చేసుకోవాలి. మహిళా ఎమ్మెల్యే రోజాను మాట్లాడకుండా సస్పెండ్‌ చేశారు. ఒకసారి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న తరువాత ప్రజల తరుపున ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ని లదీస్తుంది. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాన్ని గొంతు నొక్కుతున్నారు. అన్ని గుట్టు చప్పుడు కాకుండా మోసం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అ పహాస్యం చేస్తున్నారు. ఏకైక మార్గం ప్రజల మధ్యకు వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల ముందు పెట్టడమే సరైన మార్గంగా మేం భావించాం. మీ గ్రామాలకు వచ్చినప్పుడు వైయస్‌ జగనకు మీ సమస్యలు చెప్పుకోండి. అందరు వైయస్‌ జగన్‌ను కలవండి. పాదయాత్రను విజయవంతం చేద్దాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు. ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని ధర్మాన పిలుపునిచ్చారు. 
Back to Top