కురుపాం నియోజకవర్గంలోకి ప్రవేశించిన ప్రజా సంకల్పయాత్ర...

ఘన స్వాగతం పలికిన ఆశేష ప్రజానీకం..
తోటపల్లి బ్యారేజీ మీదగా సాగుతున్న పాదయాత్ర...

విజయనగరంః వైయస్‌ జగన్‌  ప్రజా సంకల్పయాత్ర పార్వతీపురం నియోజకవర్గంలో పూర్తి చేసుకుని కురుపాం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది.ఆశేష ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి స్వాగతం పలికారు. తోటపల్లి బ్యారేజీపై మూడు కిల్లోమీటర్లు  వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది.విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల రైతులను దృష్టిలో పెట్టుకుని దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి తోటపల్లి రిజ్వరాయర్‌ను పూర్తిచేయాలని సంకల్పించారు.రూ.450 కోట్లు విడుదల చేసి రిజ్వరాయర్‌ పనులు ప్రారంభించారు. 2008 నాటికి 850 కోట్ల రూపాయాలు కేటాయించి 90 శాతం పనులు పూర్తి చేశారు.వైయస్‌ మరణానంతరం తోటపల్లి ప్రాజెక్టు నత్తనడకన సాగింది. మిగిలిన 10 శాతం పనులను కూడా చంద్రబాబు పూర్తిచేయలేదు. ఈ నాలుగున్నరేళ్లలో కనీసం పిల్ల కాలువలు కూడా తవ్వలేకపోయారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బాబు నిర్లక్ష్యం కారణంగా ఇంకా 85వేల ఎకరాలకు నీర అందని పరిస్థితి అని రైతులు అన్నారు. వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర తోటపల్లి ప్రాజెక్టు కట్ట మీదగా సాగుతున్న సందర్భంగా అన్నదాతలు వైయస్‌ఆర్‌ హయాంలో జరిగిన మేలును గుర్తుచేసుకుంటున్నారు.
Back to Top