పూర్తయిన షర్మిల 43వ రోజు పాదయాత్ర

మూలమళ్ళ (పాలమూరు జిల్లా), 29 నవంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం నాటి షెడ్యూల్‌ పూర్తయింది. శ్రీమతి షర్మిల ఈ రోజు మొత్తం 17.5 కిలోమీటర్లు పాదయాత్రగా నడిచారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు, దాన్ని అవిశ్వాసం పెట్టి పదవి నుంచి దించేయకుండా చోద్యం చూస్తున్ టిడిపికి వ్యతిరేకంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి తరఫున శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. రాత్రికి షర్మిల మూలమళ్ళ చేరుకోవడంతో షెడ్యూల్‌ పూర్తయింది.

గురువారం ఉదయం ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నెట్టెంపాడు ప్రాజెక్టు నుంచి ప్రారంభమైంది. నెట్టెంపాడు ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం వామనపల్లి, నరసందొడ్డి, జూరాల ప్రాజెక్టు, నందిమల్ల మీదుగా షర్మిల మూలమళ్ళ శివారు ప్రాంతానికి చేరుకున్నారు. శ్రీమతి షర్మిల నేటికి 43 రోజుల పాదయాత్రలో మొత్తం 589 కిలోమీటర్లు మరో ప్రజాప్రస్థానం చేశారు. గురువారం రాత్రికి శ్రీమతి షర్మిల మూలమళ్ళలో బసచేస్తారు.

Back to Top