చంద్రబాబుకు రాజకీయ అవసరాలే ముఖ్యం

విజయవాడ: చంద్రబాబుకు రాజకీయ అవసరాలే ముఖ్యమని వైయస్‌ఆర్‌సీపీ పార్థసారధి విమర్శించారు. ప్రత్యేక హోదా కావాలని డిమాండు చేస్తున్న ప్రజలు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొని దిగ్విజయం చేసినందుకు  ధన్యవాదాలు తెలిపారు. నాలుగేళ్ల నుంచి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అందరిని కూడగట్టి ఉద్యమించాల్సిన చంద్రబాబు ..బంద్‌లో పాల్గొన్న నాయకులు, ప్రజలను అరెస్టు చేస్తూ పోరాటాన్ని నిర్యీర్యం చేయడం శోచనీయమన్నారు. చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టి ఏమైనా సాధించారా అని నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్‌ గాంధీ ఆ చర్చలో వారి వ్యక్తిగత లెక్కలు తేల్చుకున్నారన్నారు. ఎక్కడా కూడా వారు ప్రజలకు భరోసా కల్పించే మాటలు మాట్లాడలేదన్నారు. మిగతా రాజకీయ పక్షాలు కూడా ఏపీకి జరిగిన అన్యాయాలను ప్రస్తావించలేదన్నారు. ముందుమో జబ్బాలు చరిచిన టీడీపీ ఎన్‌డీఏను ప్రశ్నించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. నరేంద్రమోడీని విమర్శించకుండా చిల్లరగా మాట్లాడారని విమర్శించారు. హోదా దొంగ తెలుగు దేశం పార్టీ అని తెలిసిపోయిందన్నారు. టీడీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. చంద్రబాబు ఒప్పుకున్న తరువాతే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని ప్రధాని పేర్కొన్నారని, దానిపై ఇంతవరకు సమాధానం చెప్పే పరిస్థితిలో చంద్రబాబు లేరన్నారు. అవిశ్వాస తీర్మానం అనంతరం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారని నిలదీశారు. ఢిల్లీలో ప్రధానిని నిలదీయలేదని, ప్రధాని వ్యాఖ్యలను ఎక్కడా కూడా ఖండించలేదన్నారు. ప్రత్యేక హోదాను పూడ్చిపెట్టారని మండిపడ్డారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి బంద్‌ చేస్తుంటే..కొన్ని పార్టీలు నిసిగ్గుగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా చంద్రబాబు మాకు మిత్రుడే అన్నారని, దాన్ని ఇంతవరకు టీడీపీ ఖండించలేదన్నారు. మళ్లీ కుర్చీ కోసం బీజేపీ కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వంపై మొట్ట మొదట పోరాటం చేస్తుంది వైయస్‌ఆర్‌సీపీనే అన్నారు. హోదా కోసం ఆనేక పోరాటాలు చేశామని, మా అధ్యక్షులు వైయస్‌ జగన్‌ గుంటూరు, ఢిల్లీలో నిరాహార దీక్షలు చేశారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌సీపీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. 
Back to Top