టీడీపీ ఉడత బెదిరింపులకు భయపడేది లేదు

  • ప్రభుత్వ తప్పులను, అవినీతిని ఎండగడుతూనే ఉంటాం
  • సోషల్‌ మీడియాను ఇంకా బలోపేతం చేస్తాం
  • వైయస్‌ జగన్, కేసీఆర్, అసెంబ్లీని టీడీపీ గతంలో ఘోరంగా కించపర్చింది
  • పోలీస్ డిపార్ట్ మెంట్ చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేస్తోంది
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఐటీ విభాగం అధ్యక్షుడు చల్లా మధు
తుళ్లూరు: తెలుగుదేశం ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు, ఉడత బెదిరింపులకు  భయపడేది లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఐటీ విభాగం అధ్యక్షుడు చల్లా మధుసూదన్‌రెడ్డి స్పష్టం చేశారు. తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో విచారణ అనంతరం చల్లా మధు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మీడియానంతా తన చేతుల్లోకి తీసుకున్న తరువాత సోషల్‌ మీడియా ద్వారానే ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయన్నారు. సోషల్‌ మీడియా ప్రస్తుతం ఫిఫ్త్‌ ఎస్టేట్‌గా తయారైందన్నారు. కాబట్టి సోషల్‌ మీడియాను ఇంకా బలోపేతం చేస్తామన్నారు. పొలిటికల్‌ పంచ్‌ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ను అరెస్టు చేసినంత మాత్రన ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ స్పష్టం చేయడం జరిగిందన్నారు. రవికిరణ్ ప్రీలాన్సర్ గా ఎక్కడో పనిచేస్తుంటారని, ఆయన తమ వాలంటీర్ మాత్రమేనని మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆయనకు వైయస్సార్సీపీ ఎలాంటి జీతాలు ఇవ్వదని, ఆయన పార్టీ అబిమాని మాత్రమేనని చెప్పారు.  విచారణలో కూడ ఇదే విషయాన్ని తెలియజేసినట్టు మధుసూదన్ రెడ్డి తెలిపారు.  రవికిరణ్‌కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీపై అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు తమ వెబ్ సైట్ లో ఎప్పుడూ పెట్టలేదన్నారు.   కానీ, ప్రభుత్వ తప్పులను, అవినీతిని నిరంతరం ఎండగడుతూ ముందుకు వెళ్తామని చెప్పారు.

కేసులకు భయపడే ప్రసక్తేలేదు
చంద్రబాబు డైరెక్షన్‌లో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ పనిచేస్తుందని చల్లా మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఫేస్‌బుక్‌ అఫీషియల్‌ పేజీలో వైయస్‌ జగన్‌ కుటుంబ సభ్యులను, కేసీఆర్ ను, అసెంబ్లీని బూతుబంగ్లాలా చిత్రీకరించారని...అయినా ఇంతవరకు టీడీపీపై చర్యలు ఎందుకు తీసుకోలేదని విచారణ సందర్భంగా పోలీసు అధికారులతో ఫైట్ చేసినట్టు మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు.  వీటన్నింటి ఆధారంగా టీడీపీపై ఫిర్యాదు ఇస్తే పోలీసులు తీసుకోవడం లేదన్నారు. ఒక వ్యక్తిని 24 గంటలు అరెస్టు చేసి నాలుగు కార్లలో తిప్పుతూ.. భయబ్రాంతులకు గురిచేస్తూ, ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశారా.. లేదా అనేది చెప్పకుండా.. అర్థరాత్రి ఉగ్రవాదిని తీసుకెళ్లినట్లు తీసుకెళ్లారని ఫైర్‌ అయ్యారు. కానీ టీడీపీ చేసిన తప్పులపై ఫిర్యాదు తీసుకోలేని స్థితికి పోలీసుల పరిస్థితి దిగజారిందన్నారు. టీడీపీ ప్రభుత్వం, పోలీసులు కలిసి ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. 

తాజా వీడియోలు

Back to Top