ఎత్తిపోతలతో డెల్టా ఎడారే: పిల్లి

ద్రాక్షారామం: పట్టిసీమ వద్ద ప్రభుత్వ చేపట్టబోయే ఎత్తిపోతల పథకం వల్ల రాబోవు కాలంలో జిల్లాలోని డెల్టా ప్రాంతం ఎడారిగా మారుతుందని మాజీ మంత్రి, వైఎస్సాఆర్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల రాష్ట్ర కమిటీ సభ్యుడు  పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ద్రాక్షారామంలో జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మూడేళ్లలో పోలవరం చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇంత త్వరగా పట్టిసీమ ఎత్తిపోతలను ఎందుకు ప్రారంభిస్తుందని ప్రశ్నించారు. దీని ద్వారా అంతర్రాష్ట్ట్ర్ర జల ఒప్పందంలో భాగంగా గోదావరిలో 34 టీఎంసీల నీరు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులంతా సంఘటితమై ఈ ప్రాజెక్టును నిలిపివేసేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధం కావాలని సూచించారు

తాజా వీడియోలు

Back to Top