<strong>వేములవాడ (కరీంనగర్ జిల్లా):</strong> మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో సంక్షేమం జాడే లేకుండా పోయిందని వైయస్‌ఆర్ సిపి కేంద్ర పాలకమండలి సభ్యుడు ఆది శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను చిన్నచూపు చూసిన చంద్రబాబు ఇప్పుడు అన్నీ ఇస్తామంటూ పాదయాత్ర చేయడం హాస్యాస్పదమన్నారు. విద్యుత్ అడిగినందుకు బషీర్‌బాగ్ కాల్పుల్లో రైతులను పొట్టనపెట్టుకున్న ఆయన అన్నదాతల గురించి మాట్లాడడం ఎందుకనేది ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. వేములవాడ ఆటో యూనియన్ నాయకుడు సంద్రగిరి శ్రీనివాస్‌గౌడ్ 300 మంది అనుచరులతో మంగళవారం వైయస్‌ఆర్‌సిపిలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆది శ్రీనివాస్ మాట్లాడారు.<br/>పార్టీ జిల్లా కన్వీనర్ పుట్ట మధు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ తీగల రవీందర్‌గౌడ్ వారికి స్వాగతం పలికారు. పుట్ట మధు, తీగల రవీందర్‌గౌడ్, పార్టీ నగర పంచాయతీ కన్వీనర్ అయిల్నేని సుధాకర్‌రావు కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.<br/>వైయస్‌ఆర్‌సిపి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పొద్దుపొడుపు లింగారెడ్డి, మండల కన్వీనర్ యేష తిరుపతి యూదవ్, ఆటోయూనియన్ నాయకులు దేవరాజు, బర్కత్, అంజిబాబు, దేవయ్య, అజ్మత్ అలీ, షౌకత్, నారాయణ, లింగయ్య , మక్బూల్, చిరంజీవి, వేణు, సాగర్, పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.