పావురాలగుట్టలో వైయస్‌ఆర్ సీపీ నేతల శ్రద్ధాంజలి

కర్నూలు‌, 2 సెప్టెంబర్‌ 2012 : హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రజానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి‌ మరణించిన ప్రాంతం పావురాలగుట్టకు ఆదివారం ఉదయం వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నేతలు వై‌వి. సుబ్బారెడ్డి, ఎం.వి. మైసూరారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి. మోహన్‌రెడ్డి తదితరులు  బయలుదేరి వెళ్ళారు. వైయస్‌ఆర్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైన ప్రాంతంలో వారు ఆయనకు నివాళులు అర్పిస్తారు. హైదరాబాద్‌ నుంచి పావురాలగుట్టకు వెళ్తున్న పార్టీ నేతలంతా మార్గమధ్యలో కర్నూలులోని ఎస్‌.వి. సర్కిల్‌లో వైయస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వైయస్ఆర్ వర్ధంతి‌ సందర్భంగా ఆయన పథకాలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు.

Back to Top