పట్టిసీమ ప్రాజెక్టు ఏడాది లోగా పూర్తి చేయకపోతే రాజీనామా చేస్తారా?

హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టు ఏడాది లోగా పూర్తి చేయకపోతే నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రి పదవికి రాజీనామా చేస్తారా ? అని వైఎస్సార్సీపీ అధికార ప్రతి నిధి పార్థసారథి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రైతుల జీవితానలు దుర్భరం చేస్తోందని ఆయన అన్నారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీపై రైతులు తమ గోడు చెప్పుకోవాలంటే పక్క రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పారిశ్రామిక వేత్తలకు పెండింగ్లో ఉన్న రూ.1500 కోట్ల సబ్సిడీ బకాయిలను విడుదల చేయటంలో ఉన్న పరమార్థం ఏంటని ఈ సందర్భంగా పార్థసారథి ప్రశ్నించారు. ఇందులో ఒక్కో మంత్రికి రూ.25 కోట్లు అందినట్టు సమాచారం ఉందని ఆయన విమర్శించారు. రుణమాఫీ చేయడానికి చేతులు రావు కానీ, పారిశ్రామిక వేత్తలంటే వడివడిగా ముందుకెళ్తారని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని పార్థసారథి మండిపడ్డారు.

తాజా వీడియోలు

Back to Top