సందెపు శ్రీ‌ను వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

విశాఖ‌:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఆక‌ర్శితులై, న‌వ‌ర‌త్నాల‌తో ప్ర‌జ‌ల‌కు మేలు క‌లుగుతుంద‌ని న‌మ్మి వివిధ పార్టీల నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలోకి వ‌ల‌స వ‌స్తున్నారు. తాజాగా 266వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ముచ్చెర్ల వ‌ద్ద సందెపు శ్రీ‌ను, అత‌ని అనుచ‌రులు పెద్ద ఎత్తున వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వారికి జ‌న‌నేత పార్టీ కండువాలు కప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు.  అనంత‌రం వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను మొద‌లుపెట్టారు. పాదయాత్రలో దారిపొడపునా బారులుతీరిన ప్రజలు జననేతకు తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో టీడీపీ పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను వైయ‌స్‌ జగన్‌ దృష్టికి తీసుకొస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ప‌లువురు జననేతను కలిసి మొరపెట్టుకున్నారు.

తాజా ఫోటోలు

Back to Top