పండుగ పూట.. భూమన ప్రజా బాట

తిరుపతి:

ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నరక చతుర్దశి పర్వదినాన సైతం ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తవీధి, మిట్టమీది, మిట్ట వీధి సందు, చిన్నబజారు వీధి, ఆర్‌ఎస్. మాడ వీధులలో పర్యటించారు. స్థానికులతో కలిసి టపాకాయలు కాల్చారు. ప్రజాబాటలో భాగంగా ప్రతి గడప ముందు నిలిచి ఆ కుటుంబాల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా కాలనీలలోని ప్రజలు తమ సమస్యలను గురించి ఎమ్మెల్యేకి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో అతి పురాతనమైన కొత్తవీధి, మిట్టవీధి, చిన్నబజారు వీధి వంటి ప్రాంతాలు డ్రైనేజీ, రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరమన్నారు. అధికారులు వెంటనే స్పందించి కాలనీల్లోని సమస్యలు పరిష్కరించాలని కోరారు. మిట్టవీధి సందులో మహిళలు కుళాయి ఏర్పాటు చేయాలని చేసిన విజ్ఞప్తికి స్పందించి వెంటనే అక్కడే ఉన్న మున్సిపల్ అధికారులను ఆమేరకు ఎమ్మెల్యే ఆదేశించారు.

Back to Top