అశ్రునయనాలతో అంత్యక్రియలు

అనంత‌పురం: కర్నూలు జిల్లా నంద్యాల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు వడ్డి పుల్లారెడ్డి, వడ్డి చిన్నరామలింగారెడ్డి అంత్య‌క్రియ‌లు స్వగ్రామమైన కునుకుంట్లలో శుక్రవారం అశ్రున‌య‌నాల‌తో నిర్వహించారు.  అంత్యక్రియల్లో గ్రామస్తులతో పాటు పలు గ్రామాలు, పట్టణాలకు చెందిన వందలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, సీఈసీ సభ్యులు, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి  గ్రామానికి వెళ్లి మృతులకు నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులు పుల్లారెడ్డి భార్య లక్ష్మిదేవి, కుమారుడు నాలింగారెడ్డి, చిన్నరామలింగారెడ్డి భార్య చంద్రకళ, సోదరులు బ్రహ్మానందరెడ్డి, పెద్దరామలింగారెడ్డి, లింగారెడ్డిలను పరామర్శించి, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, అప్పరాచెరువు ఈశ్వర్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ వడ్డి రామలింగారెడ్డి, మాజీ ఎంపీపీ గోపాల్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు అశ్వర్థు, జిల్లా కార్యదర్శి అగిలే శంకర్‌రెడ్డి, వైటీ చంద్రశేఖర్‌రెడ్డి, టీచర్‌ రామలింగారెడ్డి, సాయినాథ్‌రెడ్డి, ద్వారకనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top